Thursday, December 1, 2011




నిరంతరం


నా నువ్వు
నేనైనపుడు
నీ నేను
అస్తిత్వం కోల్పోతాను
అపుడు
నేనున్నా లేనట్లే
నువ్వున్నా నేనైనట్లే


నేనుండీ లేక
నువ్వు లేక
నీలో నేనుంటాను

అందుకేనేమో
నీ కోసం నా తపన
నా కోసం నీ దాహం
ఎన్నటికి తీరదు

No comments:

Post a Comment