Thursday, December 31, 2009

వినూత్న వీడ్కోలు

అదేమో

జ్ఞాపకాల విత్తనాలు చల్లుకుంటూ
అలా నడుస్తో ఉన్నానా
వెనక్కి తిరిగి చూసుకునేసరికి

నువ్వు

నే చల్లిన
జ్ఞాపకాల విత్తనాలు ఏరుకుంటూ
నాకు వీడ్కోలు చెబుతో

ఈ సంవత్సర కాలం అంతా
నువ్వు నాతొ
ఒక్క క్షణం మన మధ్య ఎడబాటు లేదు

నాతొ బాటు నవ్వావు
ఎగిరావు గెంతావు
ఆడావు పాడావు

ఏడ్చినపుడు నిశ్శబ్దం అయ్యావు
నవ్వినపుడు తుల్లింతలయ్యావు
అలసినపుడు తల్లివయ్యావు

విషాదంలో ఓదార్పువయ్యావు
చెడు జ్ఞాపకాలకు మరుపు మందువు అయ్యావు
తీపి గుర్తులకు వేదిక నువ్వై నిలిచావు

మళ్లీ మనం కలవము అని తెలుసు
కానీ నీతో గడిపిన ఈ కాలము
నా జీవిత గమనంలో ఒక మైలు రాయి

ప్రియతమా

నీ తోటి నా అనుభవాలు
మూట కట్టుకొని
కొత్త నేస్తంతో జత కట్టడానికి వెళ్తున్నా


నిన్ను మల్లి కలవాలనే ఆత్రుత లేదు
కొత్త దారుల్ని వెతుక్కోడం తప్ప

ఇప్పుడు విరహం లేదు
కొత్తదనం మీది మమకారం తప్ప


ఇక్కడ నిరాశ నిస్పృహ లేదు
ఆశలు, ఆశయాలు తప్ప

ఇక్కడ శూన్యం లేదు
అన్ని కావాలనే ఆత్రుత తప్ప

నేస్తం

నా కొత్త నేస్తానికి స్వాగతం
చెప్పడానికి వెళ్తున్నా
నీకిక వీడ్కోలు

(పాత సంవత్సరానికి వీడ్కోలు
నూతన సంవత్సరానికి స్వాగతం కి వచ్చిన బాధలండి ఇవీ :) )

బ్లాగు జనులందరికి నా
హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు

No comments:

Post a Comment