నీ కోసం ఎదురు చూసినంత సేపు పట్టలేదు
నువ్వు వచ్చావు వెళ్లావు
నేను నీ ఊహల్లో మునిగినంత సేపు పట్టలేదు
నీతోటి నా కాలం కరిగిపోవటానికి
నేస్తం
నీ కోసం ఈ ఎదురు చూపులు
కాలంలో కరిగిపోతున్నాయి
కన్నీరు తుడుచుకోవడానికి కూడా
నాకు సమయం లేదు
ఆ లిప్త మాత్రం లోనే
నువ్వు వచ్చి వెళ్ళిపోతే
నేను భరించలేను
No comments:
Post a Comment