ఇదో ఈ నీరవ నిశీధి అంచున నిలబడి
నిశ్శబ్ద గీతాలను అల్లుతున్నాను
గొంతు పెకలదు
మాట రాదు
శబ్దం లేదు
అయినా
పెను తుఫానులు
నా హృదయంలో
నీకేమైనా
వినిపించాయానేస్తం
Saturday, November 28, 2009
Saturday, November 21, 2009
నీ కోసం
నీ కోసం ఎదురు చూసినంత సేపు పట్టలేదు
నువ్వు వచ్చావు వెళ్లావు
నేను నీ ఊహల్లో మునిగినంత సేపు పట్టలేదు
నీతోటి నా కాలం కరిగిపోవటానికి
నేస్తం
నీ కోసం ఈ ఎదురు చూపులు
కాలంలో కరిగిపోతున్నాయి
కన్నీరు తుడుచుకోవడానికి కూడా
నాకు సమయం లేదు
ఆ లిప్త మాత్రం లోనే
నువ్వు వచ్చి వెళ్ళిపోతే
నేను భరించలేను
నువ్వు వచ్చావు వెళ్లావు
నేను నీ ఊహల్లో మునిగినంత సేపు పట్టలేదు
నీతోటి నా కాలం కరిగిపోవటానికి
నేస్తం
నీ కోసం ఈ ఎదురు చూపులు
కాలంలో కరిగిపోతున్నాయి
కన్నీరు తుడుచుకోవడానికి కూడా
నాకు సమయం లేదు
ఆ లిప్త మాత్రం లోనే
నువ్వు వచ్చి వెళ్ళిపోతే
నేను భరించలేను
Friday, November 20, 2009
వసంతం
జాజి మల్లె తోటలోన
సన్నజాజి పందిరి నీడ
కూర్చొని వసంతం కోసం ఎదురు చూసిన వేళ
గల గల గాజుల సవ్వడి వింటి
వడి వడి అందెల రవళుల వింటి
రాలిన పూల కుప్పలే పోసి
వీచిన మల్లెల వాసనలే చూసి
రాణి చెలియ కోసం ఎదురు చూసిన వేళ
జలతారు చీర రెప రెపలే వింటి
మిన్నాగు జడ తడబాటే కంటి
పచ్చని ఆమని నడిగి
పేర్చిన పూల చెలి మెడ వేసి
మురిపించే ముద్దురాలి
పాణి గ్రహించేడి వేళ
కొమ్మల్లోని కోయిలమ్మ
సన్నాయి పాటల పాడగా వింటి
సన్నజాజి పందిరి నీడ
కూర్చొని వసంతం కోసం ఎదురు చూసిన వేళ
గల గల గాజుల సవ్వడి వింటి
వడి వడి అందెల రవళుల వింటి
రాలిన పూల కుప్పలే పోసి
వీచిన మల్లెల వాసనలే చూసి
రాణి చెలియ కోసం ఎదురు చూసిన వేళ
జలతారు చీర రెప రెపలే వింటి
మిన్నాగు జడ తడబాటే కంటి
పచ్చని ఆమని నడిగి
పేర్చిన పూల చెలి మెడ వేసి
మురిపించే ముద్దురాలి
పాణి గ్రహించేడి వేళ
కొమ్మల్లోని కోయిలమ్మ
సన్నాయి పాటల పాడగా వింటి
Subscribe to:
Posts (Atom)