సీతాకోకచిలుకలు
నెమల్లు
ఇంద్రచాపములు
లతలు
ఎన్నెన్ని కళలు
ఎన్నెన్ని వర్ణాలు
అన్ని మా ఇంటి వాకిట్లోనే
రంగవల్లికలై
ఎంత అందంగా అమరి పోయాయని
నీ జ్ఞాపకాలు
నా గుండెల్లో అమరినంతగా
నీ ఉహాలు
నా బుగ్గలపై పూసినంతగా
నీ శ్వాస
నా శ్వాసతో కలిసి
పరిమళించినంతగా
నీ మనసు
నా మనసుతో మమేకమైనంతగా
ఏం చెప్పను నేస్తం
అన్ని వర్ణాలు నువ్వై
సంక్రాంతివై నువ్వే వస్తే
పులకరింతల పువ్వవుతాను
చామంతిలా విరబూస్తాను
నీ పొద్దుతిరుగుడు పూవవుతాను